VIDEO: 'ప్రమాదం జరగక ముందే జాగ్రత్త పడాలి'
CTR: కార్వేటినగరం మండలం, ఆర్కేవీబీ పేట సచివాలయం వద్ద విద్యుత్ స్తంభానికి కరెంట్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ట్రాన్స్ ఫార్మర్ వద్ద వైర్లు కిందకు వేలాడుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే విద్యుత్ శాఖ అధికారులు వైర్లను సరిచేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.