లారీని ఢీ కొట్టిన బైక్.. వ్యక్తి మృతి
ELR: జీలుగుమిల్లి మండలం రమణక్కపేట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.