ధనుష్ 'కారా' సెకండ్ సింగిల్ అప్‌డేట్

ధనుష్ 'కారా' సెకండ్ సింగిల్ అప్‌డేట్

ధనుష్ హీరోగా, విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కారా'. ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. ఈనెల 30న ఈ చిత్రం విడుదల కాబోతుండటంతో, మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసిన మేకర్స్, ఈ నెల 8న రెండో పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు.