ఇస్త్రీ పెట్టెతో బీఆర్ఎస్ ప్రచారం

ఇస్త్రీ పెట్టెతో బీఆర్ఎస్ ప్రచారం

BDK: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వినూత్నంగా ఓటర్లను ఆకర్షించారు. శనివారం పాల్వంచ మున్సిపాలిటీ 37వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం చేస్తూ స్వయంగా ఇస్త్రీ పెట్టె చేతబట్టి ప్రచారం నిర్వహించారు. డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ, పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.