నేడు రాత్రి 11గంటల వరకు పన్నులు చెల్లింపు

ATP: ఆర్థిక సంవత్సరం సోమవారం ముగియనుండటంతో నేడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నగర పాలకలోని కేంద్రంలో ప్రజలు పన్నులు చెల్లించడానికి అవకాశం కల్పించామని నగర కమిషనర్ బాలస్వామి తెలిపారు. 50శాతం వడ్డీ రాయితీతో చెల్లించవచ్చు అన్నారు. ఇతర కౌంటర్ల వద్ద ఉదయం 6నుంచి రాత్రి 9గంటల వరకు చెల్లించవచ్చని సూచించారు.