మరోసారి 'మెలోడీ' VIRAL
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో వారు సరదాగా.. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇరు నేతలు చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి మెలోడీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.