విద్యార్థినిలకు శుద్ధమైన తాగునీటిని అందించాలి: కలెక్టర్
MBNR: నవాబ్‌పేట మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడాన్ని గమనించిన కలెక్టర్ దానిని వెంటనే మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెచ్చి విద్యార్థినిలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని ఆదేశించారు. అలాగే నిర్మాణంలో ఉన్న పాఠశాల ప్రహరీ గోడ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.