VIDEO: జలమయంగా మణుగూరు రహదారిపై

KMM: మణుగూరు మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి స్థానిక మెయిన్ రోడ్ భగత్ సింగ్ నగర్ స్థూపం వద్ద మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.