శ్రీబాల త్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

W.G: భీమవరంలోని మెంటేవారి తోటలో గల శ్రీబాల త్రిపుర సుందరి అమ్మవారికి శ్రావణ మంగళవారం సందర్భంగా 108 తులసి మొక్కలు, కొబ్బరికాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ పర్యవేక్షణలో కుంకుమార్చన, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మద్దాల సత్యనారాయణ, లక్ష్మి బ్రహ్మాజీ, గంధం రాంబాబు, సత్య వరలక్ష్మి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.