కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా బాధ్యతల స్వీకరణ
JN: జనగాం జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.