VIDEO: రేషన్ షాప్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
CTR: మదనపల్లి సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి పుంగనూరు పట్టణంలోని మేలుపట్లలో గల రేషన్ షాప్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరగకుండా, నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు సకాలంలో అందుతున్నాయో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో సబ్ కలెక్టర్ వెంట MROరాము, RI ఫణి కుమార్, సిబంది ఉన్నారు.