VIDEO: ట్రాక్టర్ బోల్తా.. కూలీలకు గాయాలు
GNTR: ప్రత్తిపాడు(M) వంగిపురం పాత మల్లాయపాలెం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, వారిని స్థానికులు వెంటనే ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాక్టర్‌లో పరిమితికి మించి కూలీలను తీసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.