VIDEO: వసతి గృహాన్ని తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి సమీకృత బాలికల వసతి గృహాన్ని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు నరసింహ రెడ్డి సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని తెలుసుకుని నియామకానికి చర్యలు చేపట్టాలని డీడీని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.