తిరుపతిలో 7బైక్‌లు సీజ్

TPT: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కావెంజర్స్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేశారు. డీఎస్పీ భక్తవత్సలం, ముగ్గురు సీఐలు, 20మంది పోలీస్ సిబ్బందితో ప్రతి ఇంటిని చెక్ చేశారు. సరైన రికార్డులు లేని 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.