రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VZM: డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఓ బైక్ స్తంభాన్ని ఢీకొనడంతో శనివారం అర్ధరాత్రి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన ముసినేని మురళి(41) మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య సరోజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై సన్యాసినాయుడు వెల్లడించారు.