పలు పాఠశాలలను సందర్శించిన ఇన్చార్జి తహసిల్దార్

పలు పాఠశాలలను సందర్శించిన ఇన్చార్జి తహసిల్దార్

VZM: జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశాలతో కొత్తవలస మండలంలో పలు పాఠశాలలను మండల ఇన్చార్జి తహసిల్దార్ పి.సునీత, ఎంపిడివో, మండల విద్యాశాఖ అధికారిణి శ్రీదేవి శుక్రవారం సందర్శించారు. మార్చిలో జరగనున్న పదవతరగతి పరీక్షలకు విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తరగతి గదులలో వెలుతురు స్పష్టంగా వచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.