పేకాట స్థావరంపై దాడి.. పది మంది అరెస్ట్
KRNL: తుగ్గలి మండలంలోని మదనంతపురం క్రాస్ రోడ్డు సమీపంలో శుక్రవారం పేకాట ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేసినట్లు జొన్నగిరి ఎస్సై మల్లికార్జున తెలిపారు. పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి పది మందిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పారిపోయారన్నారు. వారి నుంచి రూ.15,400 నగదు, 10 బైక్లు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసు కున్నట్లు ఎస్సై వివరించారు.