బటన్ ప్రెస్ చేయండి.. సాయం పొందండి!

బటన్ ప్రెస్ చేయండి.. సాయం పొందండి!

KMR: సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారి 161పై పసుపు పచ్చని రంగులో అక్కడక్కడ ఈ ఎమర్జెన్సీ ఫోన్ బాక్స్‌లు కనిపిస్తూ ఉంటాయి. దీని ఉపయోగాలు ఏంటంటే..? ఈ దారి గుండా ప్రయాణించే వాహనాల్లో ఇంధనం అయిపోవడం వాహనం మొరాయించడం తదితర ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ ఫోన్ బాక్స్‌కు ఉండే తెల్లని బటన్ను ప్రెస్ చేసి, మన సమస్యను తెలపాలి. వెంటనే హైవే సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపడతారు.