వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తప్పనిసరి: సలోని చాబ్రా

వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తప్పనిసరి: సలోని చాబ్రా

ADB: వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలని ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. పట్టణంలోని జిల్లా వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు. వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పర్యవేక్షణతో ఉండి ఎల్లప్పుడూ అండగా నిలవాలని తెలిపారు.