రెండు రంగుల్లో బ్యాలెట్ పత్రాలు
NLG: సర్పంచ్, వార్డు సభ్యుడికి బ్యాలెట్ పత్రాలు వేర్వేరుగా ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు సభ్యుడికి తెలుపు రంగు ఉన్న బ్యాలెట్ పేపర్‌ను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ, చుండూరు డివిజన్ పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామపంచాయతీలో 991 సర్పంచ్ అభ్యర్థులు, 2, 870 వార్డుల్లో 7,893 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.