తమ్ముడి ప్రేమకు అన్న బలి

తమ్ముడి ప్రేమకు అన్న బలి

TG: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్య కలకలం రేపింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి ప్రియురాలు భవానీతో కలిసి పరార్ అయ్యాడు. ఈ విషయమై భవానీ ఇంటికి వెళ్లిన చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ గొడవ చేశాడు. దీంతో భవానీ తండ్రి వెంకటేష్ రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.