రుషికొండ తీరంలో భారీ తిమింగలం దర్శనం
VSP: రుషికొండ బీచ్ వద్ద సముద్ర తీరానికి సమీపంలో భారీ తిమింగలం కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా లోతైన సముద్రంలో ఉండే ఈ జీవి తీరానికి దగ్గరగా విహరించడం అరుదుగా జరుగుతుండటంతో, దృశ్యాలు చూపరులను కట్టిపడేశాయి. పర్యాటకులు తమ కెమెరాల్లో ఈ క్షణాలను బంధించగా, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.