రాష్ట్ర స్థాయి ఉషూ పోటీలకు జిల్లా క్రీడాకారులు

రాష్ట్ర స్థాయి ఉషూ పోటీలకు జిల్లా క్రీడాకారులు

కర్నూలు: ఈనెల 8వ తేదీ నుంచి రాజమండ్రిలో జరగబోయే రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఉషూ పోటీలకు జిల్లా జట్టు పయనం అయింది. కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జిల్లా ఉషూ సంఘం అధ్యక్షుడు బిజినేపల్లి సందీప్, కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో క్రమశిక్షణతో పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. క్రీడా కారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.