వారం రోజులుగా జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో గత ఏడు రోజుల నుంచి మూలవిరాట్ వన దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. బుధవారం ఉదయం ప్రధాన ఆలయం ఎదుట వంతెన పైనుంచి మంజీరా నది పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ ప్రాంతంలో ఘనపురం ప్రాజెక్టు పొంగిపొర్లడంతో దిగువకు వరద ఉధృతి కొనసాగుతోంది. స్థానిక రాజగోపురంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు.