పొగాకు రైతులకు శాపంగా నిబంధనలు

పొగాకు రైతులకు శాపంగా నిబంధనలు

నంద్యాల: గడివేముల మండలంలో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పొగాకు విక్రయానికి తీసుకెళ్తే నాణ్యత పేరుతో ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు కఠిన నిబంధనలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సరైన ధరలు దక్కక నష్టపోతున్నారు. సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.