వైభవంగా గంగమ్మ జాతర
అన్నమయ్య: రాజంపేట మండలం బోయినపల్లెలో గురువారం గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన చలువ పందిరి కింద అమ్మవారిని ప్రతిష్టించారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని కాయ కర్పూరాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.