ఐటిఐలో చేరే అభ్యర్థులకు అలర్ట్!

ఐటిఐలో చేరే అభ్యర్థులకు అలర్ట్!

SKLM: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి నేడు రాత్రి 12 గంటల లోపు iti.ap.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఐటిఐ ప్రవేశాల కన్వీనర్ ఎల్. సుధాకర్ రావు శనివారం వెల్లడించారు. అనంతరం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ ద్రువపత్రాలతో ప్రభుత్వ ఐటిఐలోని ఈనెల 28వ తేదీ లోగా పరిశీలన చేయించుకోవాలని చెప్పారు.