గురుకులాల్లో ఇంటర్ సీట్లకు నేరుగా ప్రవేశాలు

ATP: అంబేద్కర్ గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీ సీట్లను నేరుగా భర్తీ చేయనున్నట్లు డీసీవో జయలక్ష్మి తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని, ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఉరవకొండ, బ్రహ్మసముద్రం, నల్లమాడ, కణేకల్లు, కాళసముద్రం, బి.పప్పూరు గురుకులాల్లో వివిధ గ్రూపుల్లో SC, ST, BC, జనరల్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.