ప్రజావాణి కార్యక్రమం రద్దు

MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయినట్టు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు ఇతర కార్యక్రమాలు, రైతుల యూరియా పంపిణీ కేంద్రల పర్యవేక్షణలో పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ప్రజావాణి కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.