బస్సు ప్రమాదం.. టిప్పర్ డ్రైవర్‌పై కేసు

బస్సు ప్రమాదం.. టిప్పర్ డ్రైవర్‌పై కేసు

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బస్ కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు.. టిప్పర్ డ్రైవర్ ఆకాష్‌పై 106(1) BNS కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యవేక్షిస్తున్నారు.