మధ్యప్రదేశ్‌లో లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లు

మధ్యప్రదేశ్‌లో లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లు

మధ్యప్రదేశ్‌లో బాలాఘాట్ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరిపై రూ.43 లక్షల రివార్డు ఉంది. కోర్కాలోని CRPF క్యాంపులో దీపక్, రోహిత్ అనే ఇద్దరు నక్సలైట్లు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. దీపక్‌పై రూ.29 లక్షలు.. రోహిత్‌‌పై రూ.14 లక్షల రివార్డు ఉంది. వీరిద్దరూ తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలిశారని అధికారులు తెలిపారు.