బీసీ సంక్షేమ హాస్టల్లో తనిఖీ చేసిన జేసీ
W.G: పెనుగొండ బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని బుధవారం జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు నిర్వహిస్తున్న వసతి గృహం పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహం నిర్వాహణ, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.