రహదారులను పరిశీలించిన కలెక్టర్
కృష్ణా: మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పలు రహదారులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం పరిశీలించారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి ప్రతి రహదారి పనితీరును, నిర్మాణ నాణ్యతను ఆయన సమీక్షించారు. స్థానికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా నిర్మాణంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.