జిల్లాలో డ్రోన్లతో పోలీసుల నిఘా

జిల్లాలో డ్రోన్లతో పోలీసుల నిఘా

సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యపానంపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారాన్ని గుర్తిస్తూ ప్రజా భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.