పైప్డ్ గ్యాస్ వినియోగంపై సమీక్ష సమావేశం
SS: పుట్టపర్తి కలెక్టరేట్‌లో ‘థింక్ గ్యాస్’ ప్రతినిధులతో సోమవారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్యాస్ సరఫరాపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హిందూపూర్, పుట్టపర్తి పట్టణాల్లో గృహ అవసరాల నిమిత్తం పైప్డ్ గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.