రంగాపూర్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
KNR: హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.