వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన రాగమయి

KMM: పంద్రాగస్టు వేడుకలు సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మున్సిపల్ ఆవరణలోని వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహనీయులను స్మరించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.