పాణ్యం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్ఎంలు

NDL: గుంటూరు డీఆర్ఎం సుధేష్ణ షేన్, గుంతకల్లు DRM చంద్రశేఖర్ గుప్తాలు సోమవారం పాణ్యం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. పాణ్యం నుంచి నంద్యాల వరకు డబుల్ లైన్ పనులు పూర్తయిన తర్వాత ప్రారంభానికి రైల్వే భద్రతా కమిషనర్ వస్తున్నట్లు వారు తెలిపారు. అధికారులు భద్రతా ప్రమాణాలు, మార్గ సౌకర్యాలు, ప్రయాణికుల సౌకర్యాలపై పరిశీలన జరిపి, పలు సూచనలు అందించారు.