మల్కాపూర్ సర్పంచ్‌గా బీటెక్ గ్రాడ్యుయేట్

మల్కాపూర్ సర్పంచ్‌గా బీటెక్ గ్రాడ్యుయేట్

NZB: నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం మల్కాపూర్(A) సర్పంచ్‌గా కాటూరి నీరజ-కార్తీక్ గెలుపొందారు. బీటెక్ చదివిన నీరజ మొదటిసారిగా కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. నీరజకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని నీరజ తెలిపారు.