నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
TPT: తిరుపతి పట్టణంలోని మంగళం రూరల్, వెస్ట్, ఈస్ట్ సబ్‌స్టేషన్ పరిధిలో ఇవాళ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా ఉండదన్నారు. అలాగే కేశవనాయునిగుంటలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.