ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ

NLG: బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తల కుటుంబాలకు అందించే భీమా సౌకర్యం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన చిట్యాల మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన పోలోజు వెంకటచారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షల భీమా చెక్కును ఆదివారం పంపిణీ చేశారు.