'గోమాంసం కేసులో హోంమంత్రి మనుషులున్నారు'
AP: తిరుమల లడ్డూ పేరుతో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గోమాంసం ఎగుమతి వ్యవహారంలో హోంమంత్రి అనిత మనుషులు ఉన్నారని తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలీసులు ఖాకీడ్రెస్ వదిలి పచ్చచొక్కాలేసుకున్నారని మండిపడ్డారు. YCPపై కక్ష సాధింపు కేసులు పెడుతున్నారని అన్నారు.