ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా భారీ రాకెట్ దాడి

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా భారీ రాకెట్ దాడి

లెబనాన్ సరిహద్దు నుంచి హెజ్‌బొల్లా సంస్థ ఇజ్రాయెల్‌పై భారీ ఎత్తున రాకెట్లతో విరుచుకుపడింది. నిన్న రాత్రి ఒక్కసారిగా వందలాది క్షిపణులను ప్రయోగించడంతో ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఉత్తర ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం కూడా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై విమాన దాడులతో విరుచుకుపడుతోంది.