VIDEO: లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన
కృష్ణా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గుడివాడలో కార్మికులు ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు RCP రెడ్డి మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు పని భారం పెరుగుతుందని, కార్మికులు కట్టు బానిసలు లాగా పనిచేయాలని అన్నారు. లేబర్ కోడ్‌లకు వెనక్కి తీసుకునే వరకు కార్మికులు పోరాటం చేయాలని తెలిపారు.