‘రాముని చెరువు కట్ట అభివృద్ధికి కృషి'

MNCL: రాముని చెరువు కట్ట నిత్యం వ్యాయామానికి మంచిర్యాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కార్పొరేషన్ కమిషనర్ శివాజీ అన్నారు. మంగళవారం రాముని చెరువు కట్టను వాకర్స్ సభ్యులతో కలిసి పరిశీలించారు. చెరువు కట్టపై నెలకొన్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. వాకర్స్‌కు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.