ఇదేనా మీ రామరాజ్యం: శ్రీనివాస్ గౌడ్
TG: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై జరిగిన దాడిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. ఇదేనా కాంగ్రెస్ రామరాజ్యం అని మండిపడ్డారు. క్యాంప్ ఆఫీస్‌లో ఎవరి ఫొటో పెట్టుకోవాలో కేసీఆర్ ఇష్టమన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో రేవంత్ అన్నారని గుర్తు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.