అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సిద్దవటం ఎంపీడీవో

కడప: సిద్దవటం మండలంలోని గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీలు వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మురికి నీరు వెళ్లే కాలువలో అపరిశుభ్రత లేకుండా చూడాలని అన్నారు. ప్రజలు తాగే మంచినీటి ట్యాంకులను 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసి బ్లీచింగ్ పిచికారి చేయాలని కోరారు.