అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు
SRD: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని సర్వే నం. 993లో గోశాల సమీపంలో అక్రమంగా నిర్మించిన రెండు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ యజమానులు స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.