రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వినూత్న ప్రచారం

ASR: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జీకేవీధి పోలీసులు వినూత్నరీతిలో ప్రచారం చేపడుతున్నారు. సీఐ వర ప్రసాద్, ఎస్సై అప్పలసూరి వాహన తనిఖీలు చేపడుతూ.. వాహనదారులకు సేఫ్టీ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. రహదారి పొడవునా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. స్పీడ్ గా ఎవడైనా వెళ్తాడు.. క్షేమంగా వెళ్ళేవాడే మొనగాడు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.