ఘనంగా డా. శ్యాంప్రసాద్ జయంతి వేడుకలు

JGL: బీజేపీ మల్యాల మండల శాఖ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి, మొక్కలు నాటారు. మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం మాట్లాడుతూ.. ముఖర్జీ ఆలోచన విధానాలు ముందు చూపుకు నిదర్శనమని, ఆయన జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. వెంకటస్వామి యాదవ్, సంఘని రవి, బొట్ల ప్రసాద్, లత, గోవర్ధన్, రాములు, జీవన్ తదితరులున్నారు.